వెరైటీ కారప్పొడులు.. అవిసె,పుచ్చ గింజలతో  పొడులు.. ఇడ్లీ ..దోశెలకు సూపర్ కాంబినేషన్.. 

వెరైటీ కారప్పొడులు.. అవిసె,పుచ్చ గింజలతో  పొడులు.. ఇడ్లీ ..దోశెలకు సూపర్ కాంబినేషన్.. 

వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, కారప్పొడి వేసుకుని రెండు ముద్దలు తింటే ఆ రుచే వేరు.. అలాగే ఇడ్లీల్లోనూ చట్నీ కాకుండా.. పైన నెయ్యి, కారప్పొడి వేసుకుని తింటే ఇంకో రెండు మూడు ఇడ్లీలు లాగించేస్తాం. అయితే ఎప్పుడూ రొటీన్ గా కొబ్బరికారమో, నల్లకారమో, పల్లీ కారమో చేస్తుంటాం. అలా కాకుండా.. అవిసెగింజలు, పుచ్చగింజలు ... కమ్మని కారప్పొడులు చేసుకోవచ్చు.. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .! 

అవిసె గింజలతో కారప్పొడి తయారీకి కావలసినవి 

  • అవిసె గంజలు: 50 గ్రాములు
  • ఎండుకొబ్బరి: 50 గ్రాములు( తురమాచి
  • మినప్పప్పు :మూడు టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి :12
  • జీలకర్ర: 1టేబుల్ స్పూన్
  •  ధనియాలు :1టేబుల్ స్పూన్ 
  • వెల్లుల్లి రెబ్బలు: ఆరు 
  • చింతపండు :కొంచె ం
  • కరివేపాకు :రెండు రెమ్మలు
  • ఉప్పు: సరిపడా
  • నూనె :రెండు టేబుల్ స్పూన్లు

అవిసె గింజలతో కారప్పొడి తయారీ విధానం

పాన్​ లో  నూనె వేడిచేసి అవిసెగింజలు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చిని విడివిడిగా వేగించి పక్క నపెట్టాలి.

ఇప్పుడు మిక్సీజార్లో అవిసెగింజలు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి తురుము, మినప్పప్పు, ధనియాలు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి పొడి చేసుకుంటే అవిసె గింజలు.. కొబ్బరికారం రెడీ. ఇది వేడివేడి అన్నంలో బాగుంటుంది. ఇడ్లీ, దోశ లోకి మంచి కాంబినేషన్. 

పుచ్చగింజలతో కారప్పొడి తయారీకి కావలసినవి

  • పుచ్చగింజలు: ముప్పావు కప్పు
  • ఎండుమిర్చి: ఏడు లేదా ఎనిమిది
  • వెల్లుల్లి రెబ్బలు: పది
  • జీలకర్ర : అర టేబుల్ స్పూన్
  • ఉప్పు: తగినంత

పుచ్చగింజలతో కారప్పొడి తయారీ విధానం

పాన్ వేడిచేసి పుచ్చగింజల్ని చిటపటలాడే వరకూ వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత కొంచెం పాన్​ లో నూనె వేసి ఎండుమిర్చి వేగించి కాసేపు చల్లారనివ్వాలి.

►ALSO READ | బ్యూటీ పార్లర్ అవసరం లేదు..ఇంట్లోనే కొబ్బరినూనెతో గ్లోయింగ్ స్కిన్!

ఇప్పుడు మిక్సీజార్లో ఎండుమిర్చి, పుచ్చగింజలు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి పొడి చేయాలి. ఈ పుచ్చగింజల పొడి అన్నంలో, దోశెల్లో చాలా బాగుంటుంది.

దోశెలపై కొంచెం నెయ్యి వేసి.. తర్వాత ఈ పొడి చల్లితే చాలా టేస్టీగా ఉంటాయి.   మరి ఇంకెందుకు  ఆలస్యం... ఆరోగ్యమైన కారప్పొడితో లొట్టలు వేసుకుంటూ ఆరగించండి..

–వెలుగు,లైఫ్​–